VIDEO: పేరుకుపోయిన చెత్తాచెదారం
SKLM: నరసన్నపేట పంచాయతీ కామేశ్వర్ నగర్ -1లో చెత్తాచెదారం పేరుకుపోయి అద్వానంగా తయారయిందని కాలనీవాసులు అంటున్నారు. ఇండ్లలోనూ, షాపుల్లోనూ ఉపయోగించే చెత్తను రోడ్డు పక్కనే పడేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో దుర్వాసన అధికంగా వస్తుందని వారు తెలిపారు. దోమల బెడద ఎక్కువగా ఉంటుందన్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.