బాలిక అదృశ్యం.. కేసు నమోదు
E.G: కడియం మండలం దుళ్ళ గ్రామానికి చెందిన పూడి శ్రీలత (17) అనే బాలిక అదృశ్యంపై కడియం పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదు అయ్యింది. ఈ నెల 10 తేదీ రాత్రి సుమారు 11 గంటల నుంచి బాలిక కనిపించకపోవడంతో తండ్రి అక్కయ్య ఆమె కోసం గాలించాడు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.