పార్వతీపురంలో వంగపండు స్మృతివనం ఏర్పాటు చేయాలి
పార్వతీపురం పేరును దేశ విదేశాలకు వినిపించిన ప్రముఖ వాగ్గేయకారుడు, అలాగే తన రచనలతో, పాటలతో చైతన్య పరచిన వంగపండు పేరును ముందు తరాలకు తెలిసేలా పార్వతీపురంలో వంగపండు స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగల దాలినాయుడు కోరారు. ఈ మేరకు ఇవాళ కలక్టరేట్లో నిర్వహించిన PGRSలో వినతిపత్రం అందజేశారు.