'ఉదయమే ఉపాధి పనులకు హాజరు కావాలి'

'ఉదయమే ఉపాధి పనులకు హాజరు కావాలి'

NLG: వేసవి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఉపాధి హామీ కూలీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే పని ప్రదేశాలకు చేరుకోవాలని DRDO శేఖర్ రెడ్డి సూచించారు. గురువారం పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన, ఉపాధి పనుల మస్టర్ రోల్స్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ ప్రక్రియపై అధికారులతో సమీక్షించి, కొనుగోలు వేగవంతం చేయాలని ఆదేశించారు.