రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

MHBD: డోర్నకల్ మండలంలోని చప్లా తండా వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని 108 వాహనంలో వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.