ఈదురు గాలులకు నేలరాలిన మామిడి

ఈదురు గాలులకు నేలరాలిన మామిడి

KMR: బిక్కనూర్ మండలం జంగంపల్లిలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో మామిడి పంటకు నష్టం జరిగింది. గ్రామానికి చెందిన సచిన్ అనే రైతు ఐదు ఎకరాల మామిడి తోటలో ఏపుగా కాసిన మామిడికాయలు ఈదురు గాలులకు పూర్తిగా నేలరాలాయి. దీంతో సుమారు రూ. మూడు లక్షల పంట నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు తనను ఆదుకోవాలని కోరారు.