VIDEO: ప్రమాదం.. యువతికి తీవ్ర గాయాలు

VIDEO: ప్రమాదం.. యువతికి తీవ్ర గాయాలు

HNK: రోడ్డు ప్రమాదంలో ఓ యువతి తీవ్రంగా గాయపడిన సంఘటన ఎల్కతుర్తి మండలకేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై ప్రవీణ్ కుమార్ వివరాల మేరకు.. హుజురాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న స్కూటీని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న ప్రియ(24)పై లారీ దూసుకెళ్లింది. మరో యువతికి స్వల్ప గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన ప్రియ అనే యువతిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.