రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్
NDL: రేపు జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరిస్తారని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్‌లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు.