హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య
RR: ఇబ్రహీంపట్నంలోని ఓ హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ ప్రాంతాన్ని తీవ్ర విషాదాన్ని నింపింది. కందిమళ్ల శివ (20) అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.