BREAKING: స్టార్ హీరోపై CM విమర్శలు

తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందంటూ హీరో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఆయన వ్యాఖ్యలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తిప్పికొట్టారు. కమల్ హాసన్‌కు కన్నడ చరిత్ర గురించి ఏ మాత్రం అవగాహన లేదన్నారు. కన్నడ భాష ఎంతో పురాతనమైన భాష అని పేర్కొన్నారు. ఈ విషయం తెలియక తమ భాషపై కమల్ అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.