పొంగి పొర్లుతున్న నూర్నంపల్లి వాగు ... రాకపోకలు బంద్

VKB: జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. దీంతో జిల్లాలోని పలు వాగులు నిండు కుండల్లా పొంగిపొర్లుతున్నాయి. ఇందులో భాగంగా నూర్నంపల్లి వాగు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 40 ఏళ్ళుగా నూర్నంపల్లి వాగును పట్టించుకునే నాథుడే లేడని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. నూతన బ్రిడ్జి నిర్మాణం చెయ్యాలని గ్రామస్థులు కోరుతున్నారు.