ప్రబుత్వ సంక్షేమ పధకాలు పారదర్శకంగా ప్రజలకు చేరాలి
VZM: వృద్ధులు, వికలాంగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో పెన్షన్ అందజేయాలని బొబ్బిలి MPDO రవికుమార్ సూచించారు. బుధవారం కోమటి పల్లి, కలవరాయి గ్రామాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. లబ్ధిదారుల వద్దకు స్వయంగా వెళ్లి, వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రజలకు చేరాలని ఆయన ఆదేశించారు.