మోదీ-పుతిన్ మధ్య స్పెషల్ మొక్క.. చూశారా?
హైదరాబాద్ హౌస్‌లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ పాల్గొన్నారు. వీరి మధ్య ఉంచిన ఓ మొక్క అందరి దృష్టిని ఆకర్శించింది. ఈ మొక్క పేరు హెలికోనియా. ముఖ్యమైన చర్చలు జరిగేటప్పుడు దీనిని ఉంచడం శుభసూచకంగా భావిస్తారు. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడటానికి, అభివృద్ధికి సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.