ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహన

సంగం మండలంలోని పడమటి పాలెం గ్రామంలో మంగళవారం జిల్లా వనరుల కేంద్రం ఆత్మ సౌజన్యంతో రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులకు ఎరువుల యాజమాన్యంపై అవగాహన కల్పించారు. నీటి యాజమాన్యం, కలుపు యాజమాన్యం రైతులకు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఏడీఏ అనిత, శాస్త్రవేత్త వినీత, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.