VIDEO: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇద్దరికి రిమాండ్
కృష్ణా: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులు వజ్రకుమార్, తేలప్రోలు రాము సోమవారం విజయవాడ కోర్టులో లొంగిపోయారు. విచారణ చేపట్టిన కోర్టు వీరికి ఈ నెల 15 వరకు రిమాండ్ విధించింది. వీరు అనూహ్యంగా కోర్టుకు వచ్చి లొంగిపోవడంతో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. దీంతో పోలీసులు వారిని నెల్లూరు జైలుకు తరలించారు.