'BRS నాయకులపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి'
KMR: పర్వతారోహకురాలు మలావత్ పూర్ణను పరామర్శించడానికి వెళ్తున్న మంత్రి సీతక్కను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన నాయకులు శుక్రవారం డిమాండ్ చేశారు. మలావత్ పూర్ణను పరామర్శించడానికి వెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మరో ఇద్దరు బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం సరికాదన్నారు.