రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కోనసీమ: రాయవరం మండలం వెంటూరు గ్రామంలో బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను, బైక్ ఢీకొనడంతో గ్రామానికి చెందిన చందాల వీర వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.