నిధుల దుర్వినియోగం ఫిర్యాదులపై జడ్పీ సీఈవో విచారణ
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఫిర్యాదు రావడంతో తనిఖీ చేస్తున్న నల్గొండ జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు. ఇట్టి విషయంపై మీడియా వివరణ కోరగా, ఎంపీడీవోపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయడం జరిగిందని, దీనిపై పూర్తిస్థాయిలో రిపోర్టు తయారుచేసి తుది నివేదిక కలెక్టర్ గారికి అందజేస్తామని జడ్పీ సీఈవో తెలిపారు.