'అవినీతిపరులను ఓడించి, మంచివారికి అండగా నిలవాలి'
ASF: చింతలమానేపల్లి, బెజ్జూర్ మండలాల్లోని పలు గ్రామాలలో BJP సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా MLA హరీష్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. MLA మాట్లాడుతూ.. అవినీతిపరులను ఎన్నికల్లో ఓడించాలని, మంచివారికి అండగా నిలవాలని గ్రామస్తులను కోరారు. ప్రాణహిత కాలువ భూసేకరణలో అవినీతికి పాల్పడిన నాయకులు మళ్లీ కొత్త వేషం వేసుకొని వస్తున్నారని వారికి బుద్ది చెప్పాలన్నారు.