శాతవాహన యూనివర్సిటీలో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు

KNR: సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శాతవాహన యూనివర్సిటీలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ దేశంలో మహిళల పాత్ర ఎంతో ఉందని మహిళలు చదువుకొని ముందుకు వెళ్తే దేశం ఎంతో ముందుకు వెళ్తుందని మహిళల కొరకు 19వ శతాబ్దంలో ఎక్కువగా కృషి చేసినటువంటి మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే. ఆమె మహిళాభ్యున్నతికి ఎంతో కృషి చేసిందన్నారు.