'కార్మికుల సమస్యల పరిష్కారాలకై ఐక్య పోరాటం'
SRD: కార్మికుల సమస్యల పరిష్కారానికై ఇతర కార్మిక సంఘాలతో ఐక్య పోరాటాలకు వ్యూహం రూపొందిస్తున్నామని CITU రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ అన్నారు. పటాన్‌చెరు శ్రామిక భవన్‌లో సీఐటీయు కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. డిసెంబర్ 7, 8, 9 తేదీలలో మెదక్ పట్టణంలో సీఐటీయు రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు.