పాముకాటుతో యువ రైతు మృతి

పాముకాటుతో యువ రైతు మృతి

KRNL: ఆలూరు మండలం అరికెర గ్రామంలో సోమవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. కౌలుకు తీసుకున్న రెండు ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్న యువ రైతు రవి (32) దిగుబడి తరలిస్తున్న సమయంలో పాముకాటుకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గర్భవతి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్న రవి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.