తాగునీటి సమస్య లేకుండా చూడాలి: ఎంపీపీ

KDP: వీరపనాయనిపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీ రఘునాథరెడ్డి అధ్యక్షతన జరిగింది. మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఎంపీపీ ఆదేశించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ పురోగతి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రమౌళీశ్వర, తహసీల్ధార్ లక్ష్మిదేవి, తదితరులు పాల్గొన్నారు.