ఈనెల 22న మండల సర్వసభ్య సమావేశం

ప్రకాశం: వెలిగండ్ల మండలంలో సర్వసభ్య సమావేశం ఈనెల 22వ తేదీన జరుగుతుందని ఎంపీడీవో మహబూబ్ బాషా తెలిపారు. మంగళవారం ఎంపీడీవో మాట్లాడుతూ.. ఈ సర్వసభ్య సమావేశం ఎంపీపీ రామన మహాలక్ష్మమ్మ అధ్యక్షతన జరుగుతుందని అన్నారు. సంబంధిత అధికారులు తగు సమాచారంతో హాజరు కావాలని కోరారు. ఈ సమావేశానికి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు హాజరు కావాలన్నారు.