శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
కృష్ణా: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో డీఎస్పీ చలసాని శ్రీనివాస్, సీఐలు శివ ప్రసాద్, ఎల్. రమేష్‌తో ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యతనిస్తున్నామని, ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.