మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి: కలెక్టర్

SRD: వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతి ఒక్కరు పూజించాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. హెల్పింగ్ హ్యాండ్ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో మట్టి వినాయక విగ్రహాన్ని కలెక్టర్‌కి అందించారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలు పూజించేలా సంఘం చొరవ తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు అఖిల్, నగేష్ పాల్గొన్నారు.