'రేపు జిల్లాలో తాగునీటి సరఫరా బంద్'
MBNR: జిల్లాలో రోడ్ విస్తరణ, వాల్వ్ రిపేర్ కారణంగా రేపు ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం వరకు మొత్తం 24 గంటలు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈరోజు మిషన్ భగీరథ గ్రిడ్ డివిజన్ అధికారి డి. శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. MBNR, NRPT జిల్లాలోని 258 గ్రామాలకు, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర మున్సిపాలిటీలో పూర్తిగా నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.