భూసార పరీక్షలపై విద్యార్థులకు శిక్షణ
KDP: బద్వేలు మండలం పరిధిలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం వైయస్సార్ కడప జిల్లా సాయిల్ టెస్టింగ్ లేబరేటరీ ఏవోలు స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రాం 2025 పై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఏవో సాయి జ్యోతి భూసార పరీక్షల ప్రాముఖ్యత, మట్టి నమూనాల సేకరణ, విశ్లేషణ పద్ధతులు, పోషకాల లోపాల గురించి వివరించారు.