తెనాలిలో 200 కేజీల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
GNTR: తెనాలి డిపో రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం వన్‌టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వర్ణలత రేషన్ షాపు నుంచి సుల్తానాబాద్‌లోని ఒక పిండిమరకి ఆటోలో తరలిస్తున్న 200 కేజీల పీడీఎస్ బియ్యాన్ని ఎస్సై అబ్రహం గుర్తించి సీజ్ చేశారు. డ్రైవర్ ఫణి ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.