'ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందించాలి'

'ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందించాలి'

SKLM: ప్రభుత్వ సేవలు ప్రజలకు పారదర్శకంగా నిర్ణీత గడువులోగా అందాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. శనివారం పాతపట్నం సచివాలయం-1ను ఆకస్మికంగా సందర్శించారు. సచివాలయంలోకి ప్రవేశించిన వెంటనే సిబ్బంది హాజరు పట్టీని స్వాధీనం చేసుకున్న కలెక్టర్, ఉద్యోగుల హాజరును స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.