విద్యుత్ సబ్ స్టేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
కోనసీమ: కూటమి ప్రభుత్వంలో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంగా జరుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట శివారు ఏనుగుల మహల్‌లో రూ.3 కోట్లతో నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ పనులను ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు. పనులను త్వరగా పూర్తిచేసి సబ్ స్టేషన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు.