పోలవరంలో నేటి నుంచే నిపుణుల పర్యటన

పోలవరంలో నేటి నుంచే నిపుణుల పర్యటన

WG: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం పనుల్లో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణం.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ECRF) డ్యాం పనులు త్వరితగతిన ముందుకు సాగడంపై అంతర్జాతీయ నిపుణులు దిశానిర్దేశం చేయనున్నారు. వీరు ప్రాజెక్టు ప్రాంతంలో సోమవారం నుంచి 8వ తేదీ దాకా మకాం వేసి వాల్ పనుల్లో నాణ్యత, ECRF డ్యాం డిజైన్లు పరిశీలిస్తారు. సలహాలు, సూచనలు ఇస్తారు.