అలరించిన 'ఎల్లమ్మ' వీధి నాటకం

అలరించిన 'ఎల్లమ్మ' వీధి నాటకం

RR: కొందుర్గ్ (M) చెరుకుపల్లి గ్రామంలో ఎల్లమ్మ ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రాత్రి నిర్వహించిన వీధి నాటకం నాలుగో రోజుకు చేరుకుంది. స్థానిక కళాకారుల ప్రదర్శన భక్తులను, గ్రామస్థులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకను చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చారు. పురాతన కళలను ప్రోత్సహించడం సంతోషకరమని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.