VIDEO: 'శోభాయాత్రను విజయవంతం చేయండి'

కోనసీమ: అయినవిల్లి మండలం BJP కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ మోకా ఆదిలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 25న రాష్ట్ర BJP అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సారధ్యం యాత్ర ద్వారా శోభాయాత్ర అమలాపురంలో నిర్వహిస్తున్నారని, యాత్రలో ప్రజలు అధిక సంఖ్యలో విజయవంతం చేయాలని తెలిపారు.