మిషన్ వాత్సల్య పథకంపై కలెక్టర్ సమీక్ష

మిషన్ వాత్సల్య పథకంపై కలెక్టర్ సమీక్ష

ELR: మిషన్ వాత్సల్య పథకం అమలుకు అధికారులు మరింత సమన్వయంతో పనిచేసి మంచి లక్ష్యాలను తీసుకురావాలని కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన బాల్యాన్ని అందించడమే ప్రధాన ఏజెండాతో ముందుకు అడుగులు వేయాలని అన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు, బాల్య కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు.