'పులివెందుల నుంచి పుట్టపర్తికి బస్సు సర్వీస్'
కడప: పులివెందుల ఆర్టీసీ డిపో నుంచి పులివెందుల-ముదిగుబ్బ మీదుగా పుట్టపర్తికి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసు నడుస్తోందని ఆర్టీసీ డీఎం ప్రేమ్ కుమార్ తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10:20 గంటలకు పులివెందులలో బయలుదేరి మధ్యాహ్నం 12:55 పుట్టపర్తికి, పుట్టపర్తి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు పులివెందులకు చేరుకుంటుందన్నారు.