రామభద్రపురంలో సేంద్రియ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు

VZM: కూరగాయ పంటల సాగుకు సేంద్రీయ ఎరువులను వినియోగించి, సాగుచేయడం వల్ల రైతులకు ఖర్చులు తగ్గి నాణ్యమైన ఉత్పత్తులు పొందవచ్చునని రామభద్రపురం వెలుగు ఏపీఎం అన్నపూర్ణ తెలిపారు. మండల కేంద్రంలో సోమవారం సేంద్రియ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు చేశారు. మండల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతీ సోమవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేసి దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు.