VIDEO: పాలేరుకు తగ్గుముఖం పట్టిన వరద
KMM: పాలేరు జలాశయానికి వరద కొనసాగుతోంది. మొంథా తుఫాను కారణంగా ఎగువ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న వరద కారణంగా పాలేరు జలాశయం ఉగ్రరూపం దాల్చింది. గురువారం సాయంత్రానికి 48 వేల క్యూసెక్కుల వరద నమోదు కాగా, శుక్రవారం ఉదయం 43 వేలకు తగ్గింది. 25.70 అడుగులు ఉన్న నీటి మట్టం 25.20 అడుగులకు తగ్గింది. సాయంత్రానికి మరింత తగ్గే అవకాశం ఉంది.