నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

HNK: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ 2025 డైరీని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య నేడు ఆవిష్కరించారు. సోమవారం రాత్రి టీజీవో భవన్‌లో జరిగిన కార్యక్రమంలో డైరీని ఆవిష్కరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో గెజిటెడ్ అధికారుల పాత్ర కీలకమైనదన్నారు.