రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

రాజస్థాన్‌లోని దిద్వానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జశ్వంత్ రోడ్డులో ఒక కారు బస్సును ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.