సుగాలి కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే మాధవి

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్ సుగాలి కాలనీలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా బంజారా ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. దీర్ఘకాలికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వీటి పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.