కూలిన ఇల్లు.. నిరాశ్రయులైన కుటుంబ సభ్యులు

NLG: కల్లూరులో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురు గాలికి పుల్లయ్య బంజర్ రోడ్డులో బజ్జీలు అమ్ముకొని జీవనం సాగిస్తున్న బుడే అనే వ్యక్తి ఇల్లు వర్షానికి కుప్పకూలింది. ఇంటిపై ఉన్న రేకులు చెల్లాచెదురుగా ఎగిరిపోయి, పగిలిపోయి విచ్చలవిడిగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు. అధికారులు స్పందించి వెంటనే ఆశ్రయం కల్పించాలని, జరిగిన నష్టపరిహారం కోరారు.