ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్ల జోరు

ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్ల జోరు

ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా రూ.1,83,609 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇది గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే 8.1 శాతం పెరుగుదలను సూచిస్తోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, తెలంగాణలో రూ.4,125 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,061 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. పెరుగుతున్న వినియోగం, పన్నుల ఎగవేతపై కఠిన చర్యల వల్ల ఈ ఆదాయం పెరిగినట్లు తెలుస్తోంది.