VIDEO: బీచ్ రోడ్డులో పింక్ శారీ వాక్
VSP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం బీచ్ రోడ్డులో ఆదివారం 'పింక్ శారీ వాక్' నిర్వహించారు. మహిళల శక్తి, చైతన్యానికి ప్రతీకగా జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో గులాబీ రంగు చీరలు కట్టుకుని ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళా సాధికారతను ప్రతిబింబించేలా సాగిన ఈ వాక్ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.