VIDEO: కాటారంలో యువకుడు అనుమానాస్పద మృతి
BHPL: జిల్లాలోని కాటారం మండల కేంద్రంలో మంగళవారం ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మహాదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన పోలం రాజేందర్ (23) బయ్యారం వైపు వెళ్తుండగా జెన్‌కో పంపుహౌస్ ఎదుట గేట్ వాల్ సంపులో పడి మృతిచెందినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.