'కార్మికులు తమ హక్కులను కాపాడుకోవాలి'

'కార్మికులు తమ హక్కులను కాపాడుకోవాలి'

VZM: కార్మికులు తమ హక్కులను కాపాడుకోవాలని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ అన్నారు. మే డే పురస్కరించుకొని గజపతినగరం కోర్టు ఆవరణలో కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్మికులు తమ హక్కులను కాపాడుకోవడానికి అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని చెప్పారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు లంక రాంబాబు న్యాయవాదులు పాల్గొన్నారు.