VIDEO: ANMలను బాధ్యులను చేయడం సరికాదు: CITU

ASF: ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద నిరసన CITU ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య సమస్యలకు ANMలను బాధ్యులను చేయడం సరికాదని అన్నారు. విద్యార్థుల కోసం మందులు, ఇతర వైద్య సామాగ్రి లేకపోయినా, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోయినా ANMలు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు.