‘అపరిచిత సందేశాలకు స్పందించవద్దు'

SKLM: టెక్కలి మండలం తిర్లంగిలో ఆదివారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టెక్కలి ఎస్సై 2 రఘునాథరావు ఆధ్వర్యంలో గ్రామంలో కాల్స్ టోల్ ఫ్రీ నంబర్ ఉపయోగాలను వివరించారు. అపరిచిత సందేశాలకు స్పందించవద్దని, అపరిచిత వ్యక్తులకు ఏటీఎం కార్డులు ఇవ్వకూడదని సూచించారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా పోలీసులకు విజ్ఞప్తి చేయలన్నారు.