పెద్దూరులో పోలీసుల కార్డాన్ సెర్చ్

చిత్తూరు: రామకుప్పం మండలం పెద్దూరులో మంగళవారం పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఇటీవల గ్రామంలో రాజకీయ గొడవలు జరిగిన నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా గ్రామంలో కార్డాన్ సర్చ్ నిర్వహించారు. ఎవరైనా అనుమానితులు ఉన్నారా అంటూ స్థానికులను ఆరా తీశారు. వాహనాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.