వెంచర్‌లో వ్యక్తి దారుణ హత్య

వెంచర్‌లో వ్యక్తి దారుణ హత్య

RR: కొత్తూరు మండల కేంద్రంలోని పెద్దమ్మ తండా సమీపంలో ఈరోజు ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తండాకు ఆనుకుని ఉన్న ఓ వెంచర్‌లో గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.